Thirumalagiri: విద్యుత్ కోతలపై రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ధర్నా!
Thirumalagiri: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.
Thirumalagiri: విద్యుత్ కోతలపై రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ధర్నా!
Thirumalagiri: వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై గాదరి కిషోర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం. తుంగతుర్తి నియోజకవర్గానికి గతంలో కాళేశ్వరం ద్వారా అందించిన నీళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
పంటలు అన్ని పొట్ట దశలో ఉన్నయని ఈ సమయంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ విద్యుత్ సరఫరా చేయడం లేదు. దీంతో పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి అని కిషోర్‌కుమార్ అన్నారు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలు, నెర్రలు వారిన నేలలు, రైతుల కన్నీళ్లే కనిపిస్తున్నాయని అన్నారు.. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదు.
‘యాదాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేయాలి’ యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే ఉత్పత్తి చేయడం లేదని కిషోర్‌కుమార్ ఆరోపించారు. సాగునీరు, విద్యుత్ కొరతతో వ్యవసాయ రంగం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా క్షేత్రంలో శిక్షిస్తాం’ 50 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ రేవంత్‌రెడ్డిని వదిలేది లేదని , అన్ని కక్కిస్తాం అని అన్నారు.. రేవంత్ రెడ్డి చరిత్ర హిణుడిగా మిగలడం ఖాయం అని రైతుల ఉసురుతో ప్రభుత్వం నాశనం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.




