Maddirala: మద్దిరాలలో రూ.10 లక్షల మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన!

Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాచ్చిపాల వెంకన్న శంకుస్థాపన.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 9 Sept 2026 9:55 PM IST
Maddirala
X

Maddirala: మద్దిరాలలో రూ.10 లక్షల మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన!

మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కృషితో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాచ్చిపాల వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరై భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పాచ్చిపాల వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు, ఉప సర్పంచ్, మద్దిరాల మండల సేవల అధ్యక్షులు వల్లపు రమేష్ యాదవ్, వార్డు సభ్యులు, వడ్డాణం మధు, భాష బోయిన సోమయ్య, మహిళా సమైక్య గ్రూప్ లీడర్లు, సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy

Next Story