Suryapet: మద్దిరాలలో కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వృద్ధులు, పిల్లలు, మహిళలకు సేవలతో పాటు ఉచిత పరీక్షలు, భోజన సౌకర్యం.
Suryapet: మద్దిరాలలో కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రంలో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.ఈ వైద్య శిబిరంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వృద్ధాప్య వైద్య సేవలు, 12 సంవత్సరాల లోపు పిల్లలకు చిన్నపిల్లల వైద్య సేవలు, మహిళలకు ప్రసూతి మరియు గైనకాలజీ వైద్య సేవలు అందించనున్నారు.
శిబిరానికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పించనున్నారు.మండలంలోని ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మద్దిరాల గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో మద్దిరాల పంచాయతీ కార్యదర్శి. మద్దిరాల గ్రామ వార్డు సభ్యులు మద్దిరాల గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వడ్డాణం మదుసూదన్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




