Nalgonda: నల్లగొండ జీజీహెచ్‌లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ!
Nalgonda: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు దర్గా ముతవల్లి సయ్యద్ సమీ ఉల్లా ఖాద్రీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
Nalgonda: నల్లగొండ జీజీహెచ్‌లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ!
నల్లగొండ జిల్లా: దైవ ప్రవక్త మహమ్మద్ జన్మదినం 'మిలాద్-ఉన్-నబీ' సందర్భంగా నల్లగొండ ప్రభుత్వ వైద్యశాలలో రోగులు,నిరుపేదలకు ఉచితంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
దర్గాహ్ హజరత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రీ ఇనాందార్ ముతవల్లి సయ్యద్ సమీ ఉల్లా ఖాద్రీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు పండ్లు అందించి వారి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
Next Story




