Suryapet: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ గెలుపే లక్ష్యం: జనసేన

Suryapet: ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ విజయమే లక్ష్యంగా సూర్యాపేటలో జనసేన టౌన్ కోఆర్డినేటర్లు బాధ్యతలు చేపట్టారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 21 Oct 2026 9:16 PM IST
Suryapet
X

Suryapet: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ గెలుపే లక్ష్యం: జనసేన

సూర్యాపేట: ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాస్ విజయమే లక్ష్యంగా సూర్యాపేటలో పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.

సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఎడమ రాజేష్, పోనూరు శిరీషల పర్యవేక్షణలో, నియోజకవర్గ పీఓసీలు రామగిరి శివసాయి, ఏ.వి.రావుల ఆధ్వర్యంలో సూర్యాపేట టౌన్ జనసేన కమిటీ నూతన కోఆర్డినేటర్ల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో టౌన్ కోఆర్డినేటర్లుగా షేక్ యాకుబ్ పాషా, ఖమ్మంపాటి స్వరూప్, దండు మధు, బీమనపల్లి ఆకాష్ లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నియమితులైన వారికి నాయకులు అభినందనలు తెలియజేశారు.

జనసేన సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నాయకులు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తామని నూతన కోఆర్డినేటర్లు స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA