Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా నిర్వహించి, బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Nalgonda: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. సత్యం, అహింస, సహనం, క్రమశిక్షణ, మానవత్వం వంటి గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని తెలిపారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు కేవలం స్వాతంత్ర్య పోరాటానికే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలోనూ ఆచరించాల్సిన గొప్ప విలువలని అన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
పోలీస్ శాఖలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రజల పట్ల గౌరవం, బాధ్యత, నిబద్ధతతో వ్యవహరిస్తూ, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలని తెలిపారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా శాంతియుత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,ఎస్‌బీ డిఎస్పీ మల్లారెడ్డి, ఏ. ఆర్ డిఎస్పీ శ్రీనివాస్,ఎస్.బి సీఐ నాగరాజు,డి.సి ఆర్.బి సీఐ శ్రీను నాయక్,ఆర్‌ఐ సంతోష్, శ్రీను తో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




