Vemulapally: నీరు లేని కాలువలో వినాయక విగ్రహాలు.. భక్తుల తీవ్ర నిరసన!
Vemulapally: వేములపల్లి మండలంలో సాగర్ ఎడమ కాలువలో నీరు లేక ఎండుగర్భంలోనే కనిపిస్తున్న విగ్రహాలు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల తీవ్ర ఆగ్రహం, నిరసన.
Vemulapally: నీరు లేని కాలువలో వినాయక విగ్రహాలు.. భక్తుల తీవ్ర నిరసన!
Vemulapally: గణేష్ నిమజ్జన శోభాయాత్ర వేళ నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. గ్రామంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు వాడపల్లి ఎడమ కాలువ వద్దకు తరలించారు. అయితే కాలువలో చుక్క నీరు కూడా లేకపోవడంతో నిమజ్జనం చేసిన విగ్రహాలన్నీ నీటిపైన కాకుండా, ఎండు ముఖం పట్టిన కాలువ గర్భంలో బయటకు కనిపిస్తూ దిగులుగా నిలబడిపోయాయి.
ఈ విచిత్ర పరిస్థితిని చూసి గణేష్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభాయాత్ర తేదీలు ముందే తెలిసినా, నిమజ్జన సమయానికి కాలువలోకి నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సిన నిమజ్జనం వివాదాస్పదంగా మారిందని, తక్షణమే కాలువకు నీటిని విడుదల చేసి భక్తుల భావోద్వేగాలను గౌరవించాలని డిమాండ్ చేశారు.




