Suryapet: నేరేడుచర్లలో గంజాయి ముఠా అరెస్ట్.. 2 కేజీల గంజాయి స్వాధీనం!

Suryapet: నేరేడుచర్లలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 21 Aug 2026 7:38 AM IST
Suryapet
X

Suryapet: నేరేడుచర్లలో గంజాయి ముఠా అరెస్ట్.. 2 కేజీల గంజాయి స్వాధీనం!

Suryapet: నేరేడుచర్ల ఎస్సై కి వచ్చిన సమాచారం మేరకు నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ శివారులో ఎన్ఎస్పి కాలు వద్ద నిషేధిత గంజాయి తో ఉన్నటువంటి ఆరుగురు నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేసి వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయి ఒక ద్విచక్ర వాహనం ఒక సెల్ ఫోన్ స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ చరమందరాజు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఖమ్మం పట్టణం నుండి రెండు కేజీల గంజాయిని సురేష్ అనే అతని వద్ద నుండి నేడుచర్ల మండలానికి చెందిన ఇంజమూరి రోహిత్ కొనుగోలు చేసి కందుల శ్రీరామ్ మరియు జగదీష్, సాయి రామ్, హనుమంతు, జయరాజు అనే యువకులకు అమ్ముతూ నేరేడుచర్ల ఎస్సై గోపాల్ రెడ్డి చేసిన తనిఖీల్లో నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ శివారు కాలువ కట్ట వద్ద పట్టుబడ్డట్లు తెలిపారు.

మొత్తం పదిమంది నిందితులకు గాను ఆరుగురిని పట్టుబడి చేసి కేసు నమోదు చేసి రిమాండ్ ku తరలిస్తున్నట్లు తెలిపారు. పదిమందిలో నలుగురు గంజాయి సేవించేవారు కాగా మిగతావారు గంజాయి అమ్ముతూ జీవనం సాగిస్తుంటారని గంజాయి సేవించే నలుగురిని వారిలో మార్పు కోసం డి అడిక్షన్ సెంటర్కు పంపిస్తున్నట్లు తెలిపారు.

పారిపోయిన మిగతా నలుగురిని త్వరలో పట్టుకొని తగిన శిక్ష విధిస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో గంజాయి అమ్మిన మరియు సేవించిన వారిపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

Next Story