Chintalapalli: చింతలపల్లిలో "ఇంటింటికీ తెలుగుదేశం" పాల్గొన్న గొల్లపల్లి అమూల్య!
Chintalapalli: రాజోలు మండలం చింతలపల్లిలో నిర్వహించిన "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.
Chintalapalli: చింతలపల్లిలో "ఇంటింటికీ తెలుగుదేశం" పాల్గొన్న గొల్లపల్లి అమూల్య!
Chintalapalli: రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ (సాయిబాబు రాజు), రాజోలు మండల టీడీపీ అధ్యక్షుడు అనుచూరి పురుషోత్తం, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు లంకే శ్రీనివాసరావు, గ్రామశాఖ అధ్యక్షుడు పాటి శ్రీను, పిప్పళ్ల రాంబాబు, కలవకొలను శ్రీను, కడలి పాలంశెట్టి, నాగ మల్లికార్జునరావు, మామిడిశెట్టి శ్రీను, గుబ్బల రాంబాబు, మామిడిశెట్టి మధుసూదనరావు, దొండపాటి రామకృష్ణ, పోతిమూడి బాలరాజు, రావి రాజారావు, గుడాల బాబ్జి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




