Gopalapuram: గ్రామ కంఠం కేటాయించి న్యాయం చేయాలి

Gopalapuram: గోపాలపురంలో గ్రామ కంఠం కేటాయించి సర్వే రికార్డులు సవరించాలని కలెక్టర్‌ను కోరిన గురవయ్య గౌడ్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సర్వే పూర్తి.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 29 Oct 2026 6:20 PM IST
Gopalapuram
X

Gopalapuram: గ్రామ కంఠం కేటాయించి న్యాయం చేయాలి

గోపాలపురం: గోపాలపురం గ్రామానికి తక్షణమే అధికారికంగా గ్రామ కంఠం కేటాయించి, సర్వే రికార్డులను సవరించి గ్రామస్తులకు న్యాయం చేయాలని ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య గౌడ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించి, మూడు సర్వే నంబర్లకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు సమర్పించినట్లు ఆయన తెలిపారు.

సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామంలో దశాబ్దాలుగా గ్రామ కంఠం సమస్య పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించి, గ్రామ కంఠం కేటాయింపుపై తక్షణ చర్యలు తీసుకోవాలని గురవయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR