Nalgonda: తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ఆగ్రహం!

Nalgonda: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు. కాంగ్రెస్ నిందలు విడనాడి సొంత గుర్తుపై పోటీ చేసి గెలవాలని సవాల్.

Saleem, Nalgonda
Published on: 16 Aug 2026 10:06 AM IST
Nalgonda
X

Nalgonda: తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ఆగ్రహం!

Nalgonda: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ-ఫామ్‌తో గెలిచి, ఇప్పుడు అదే పార్టీపై నిందలు వేయడం సరికాదన్నారు.

ధైర్యముంటే సొంత పార్టీ గుర్తుపై పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. బీసీల సంక్షేమం ముసుగులో సొంత సామాజిక వర్గాన్నే అణగదొక్కుతున్నారని విమర్శించారు.

ఎదుటి కులాలను దూషించడం ఆయన అహంకారానికి నిదర్శనమని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నల్గొండ లేదా మునుగోడులో సమావేశం ఏర్పాటు చేసి తన సత్తా చాటాలని సవాల్ చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story