Nakrekal: కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ వేముల

Nakrekal: నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి మండలం మూసీ ప్రాజెక్టు నుంచి ఎడమ, కుడి కాల్వల ద్వారా సాగునీటిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం విడుదల చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 29 Jun 2026 3:54 PM IST
Nakrekal
X

Nakrekal: కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ వేముల

Nakrekal: నకిరేకల్ నియోజకవర్గంలో కేతపల్లి మండలం మూసీ ప్రాజెక్టు వద్ద ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ఎడమ, కుడి కాల్వ ద్వారా సాగు నీటిని దిగువకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విడుదల చేశారు.

గత పదేళ్లలో పేద ప్రజలకు ఇండ్లు, రేషన్ కార్డులు అందకుండా అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం.

రైతులు ఇబ్బందులు పడకుండా సాగునీటిని సమయానికి అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మూసీ ప్రాజెక్టు నీటితో వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, పేదల జీవనోపాధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story