Nakrekal: నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు అధికారులు, సిబ్బందికి ఘన సన్మానం
Nakrekal: నకిరేకల్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, కేంద్రాల నిర్వాహకులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా సన్మానించారు.
Nakrekal: నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు అధికారులు, సిబ్బందికి ఘన సన్మానం
నకిరేకల్: పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, అధికారులకు సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, అధికారులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, DCC అధ్యక్షులు పున్న కైలాష్ నేత , జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ , అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల కోసం అవిశ్రాంతంగా పనిచేశాం: ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ,
రైతుల కోసం అధికారులు, నిర్వాహకులు ఎంతో కష్టపడ్డారు. ఎక్కడైనా వడ్లు తడిస్తే రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు పనిచేశాం. రైతులు నేడు సంతోషంగా ఉండటం ఆనందంగా ఉంది అని అన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు అనేక అసత్య ఆరోపణలు చేశాయి. కానీ ఈ సీజన్‌లో భారీ స్థాయిలో ధాన్యం వచ్చినప్పటికీ సమిష్టిగా పనిచేసి వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశాం అని అన్నారు. రైతులు అందరు దొడ్డు రకాలు పండియ్యటం కాకుండా సన్న వడ్ల సాగును ప్రోత్సహించాలని" అధికారులకు సూచించారు.




