Nalgonda: ఆట పాట సీజన్-3 విజేతగా హేనా గ్రేస్.. వెంగన్నగూడెంలో సంబరాలు!

Nalgonda: ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన 'ఆట పాట' సీజన్-3 గ్రాండ్ ఫినాలేలో నిడమానూరుకు చెందిన హేనా గ్రేస్ విజేతగా నిలిచింది.

SALEEM, BANSWADA
Published on: 23 May 2026 3:11 PM IST
Nalgonda
X

Nalgonda: ఆట పాట సీజన్-3 విజేతగా హేనా గ్రేస్.. వెంగన్నగూడెంలో సంబరాలు!

Nalgonda: నిడమానూరు మండల పరిధిలోని వెంగన్నగూడెం గ్రామానికి చెందిన పొట్టేపాక అంజయ్య (ఉపసర్పంచ్) కుమార్తె హేనా గ్రేస్ బుల్లితెరపై ప్రతిభ చాటింది. ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించిన 'ఆట పాట' సీజన్-3 గ్రాండ్ ఫినాలేలో ఆమె ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సింగర్ హేనా గ్రేస్ మాట్లాడుతూ..

ఈ విజయం వెనుక తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని వారికే ఈ గెలుపు అంకితమని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు మద్దతుగా నిలిచిన వెంగన్నగూడెం గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంతాల అభిమానులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హేనా గ్రేస్ సాధించిన విజయం పట్ల స్థానికులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు కురిపిస్తున్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story