Devarakonda: రైతుల రాకపోకలకు సౌకర్యంగా గ్రావెల్ రోడ్డు: ఎమ్మెల్యే బాలు నాయక్
Devarakonda: దేవరకొండలో ఆర్&బీ గెస్ట్ హౌస్ నుంచి ఖిల్లా గుట్ట వెనుక పొలాలకు రూ.10 లక్షలతో నిర్మించిన గ్రావెల్ రోడ్డును ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు.
Devarakonda: రైతుల రాకపోకలకు సౌకర్యంగా గ్రావెల్ రోడ్డు: ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని (పోలీస్ స్టేషన్ పరిధిలో) ఆర్&బీ అతిథి గృహం నుంచి ఖిల్లా గుట్ట వెనుక భాగంలో ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఎస్‌డీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన గ్రావెల్ రోడ్డును దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణంతో స్థానిక రైతులకు వ్యవసాయ భూములకు రాకపోకలు సులభతరం అవుతాయని, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రైతులు ఎదుర్కొనే రాకపోకల ఇబ్బందులు తగ్గి, వ్యవసాయ పనులకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, చిలువేరు కాశీనాధ్, ఆలంపల్లి నర్సింహా, హనుమంతు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ రయీస్, మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, దూదిపాల వేణుధర్ రెడ్డి, వడ్త్యా దేవేందర్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




