Nalgonda: జాతీయ స్థాయిలో పెరిగిన రాహుల్ గాంధీ ఇమేజ్: గుత్తా సుఖేందర్ రెడ్డి!
Nalgonda: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కొడుకు అమిత్ పోటీపై కీలక వ్యాఖ్యలు.
Nalgonda: జాతీయ స్థాయిలో పెరిగిన రాహుల్ గాంధీ ఇమేజ్: గుత్తా సుఖేందర్ రెడ్డి!
Nalgonda: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్టెచర్ పెరిగిందని, కేంద్రంలో బీజేపీపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు . అయితే, మారుతున్న రాజకీయ సమీకరణాలను ముందే అంచనా (ప్రిడిక్ట్) వేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తన కుమారుడు అమిత్ మొదట్నుంచీ లేరని ఆయన స్పష్టం చేశారు. తాను మండలి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో అమిత్ ఉన్నారని, తన అభిప్రాయం కూడా అదేనని గుత్తా సుఖేందర్ రెడ్డి తేల్చిచెప్పారు.




