Shaligouraram: శాలిగౌరారంలో ప్రకృతి విలయం.. వేల నిమ్మచెట్లు నేలమట్టం!

Shaligouraram: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, గాలి దుమారం నిమ్మ రైతులకు తీరని నష్టం మిగిల్చింది.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 14 Jun 2026 1:46 PM IST
Shaligouraram
X

Shaligouraram: శాలిగౌరారంలో ప్రకృతి విలయం.. వేల నిమ్మచెట్లు నేలమట్టం!

శాలిగౌరారం: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షం, గాలి దుమారం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది.

బచ్చు వారిగూడెం, పెరిక, కొండారం, వల్లాల, అంబర్‌పేట్, అడ్లూరు, ఆకారం, చిత్తలూరు తదితర గ్రామాల్లో సుమారు 3 వేల నుంచి 5 వేల నిమ్మ చెట్లు నేలకూలిపోయాయి. బలమైన గాలులకు నిమ్మకాయలు రాలిపోయి పంట పూర్తిగా నాశనమైంది.

ఒకేసారి లక్షల రూపాయల నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, ఆర్థిక సహాయం అందించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story