Nalgonda: మిర్యాలగూడలో అగ్నిప్రమాదం మెకానిక్ షెడ్డు, వాహనాలు దగ్ధం!
Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం. ఆటోలో గ్యాస్ నింపుతుండగా చెలరేగిన మంటలు. మెకానిక్ షెడ్డుతో పాటు కారు, ఆటో పూర్తిగా దగ్ధం.
Nalgonda: మిర్యాలగూడలో అగ్నిప్రమాదం మెకానిక్ షెడ్డు, వాహనాలు దగ్ధం!
Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం. హనుమాన్‌పేటలోని మెకానిక్ షెడ్‌లో చెలరేగిన మంటలు. ఆటోలో గ్యాస్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా ఎగిసిపడ్డ నిప్పురవ్వలు. క్షణాల్లోనే షెడ్డు మొత్తానికి వ్యాపించిన మంటలు. ప్రమాదంలో ఒక ఆటో, ఒక కారు పూర్తిగా దగ్ధం.. మంటల ధాటికి పూర్తిగా కాలిబూడిదైన మెకానిక్ షెడ్డు.
మెకానిక్ షెడ్డు నుంచి పక్కనే ఉన్న లారీ ఆఫీస్‌కు వ్యాపించిన అగ్నికీలలు. భయాందోళనలో స్థానిక ప్రజలు. మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.
మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నం. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.. బాధితులు కన్నీరుమున్నీరు.




