Huzurnagar: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ వినతి
Huzurnagar: హుజూర్‌నగర్‌లో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేసిన బీజేపీ శ్రేణులు.
Huzurnagar: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ వినతి
హుజూర్‌నగర్: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17 ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ హుజూర్‌నగర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో *హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి వి. శ్రీనివాసులు మరియు ఎంఆర్ఓ బండ కవిత రెడ్డి లకు వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ నాటి హైదరాబాద్ నిజం నవాబ్ మరియు రజాకార్ల ఆకృత్యాలకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడి తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని అదేవిధంగా తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉందని అలాగే..
ఈ చారిత్రక దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా విమోచన పోరాటంలో త్యాగాలు చేసిన వీరుల చరిత్రను ప్రజలకు, నేటి తరం యువతకు మరింత చేరువ చేయాలని, అలాగే ఈ యొక్క విరోచితమైన పోరాటానికి మద్దతుగా ఉక్కుమనిషి, నాటి భారతదేశ ఉపప్రధాని శ్రీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు రజాకారులను అణిచివేసి ఆపరేషన్ పోలో ద్వారా నాలుగే నాలుగు రోజుల్లో అనగా సెప్టెంబర్ 13న ప్రారంభమై 17న ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు విమోచనం కలిగించారని ఈ చరిత్ర అంతా కూడా పాఠ్యపుస్తకాలు మరియు మ్యూజియంల ఏర్పాటు ద్వారా నేటి తరం పిల్లలకు, యువకులకు తెలియజేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఎల్ఎ1 తాళ్ల నరేందర్ రెడ్డి, జిల్లా లీగల్ సెల్ నాయకులు పిడమర్తి చంద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శిలు గుండా గోపి, రాళ్లబండి రామారావు, జిల్లా దళిత మోర్చా నాయకులు మేళ్ళచెరువు లక్ష్మణ్, జిల్లా ఓబిసి మోర్చా కార్యదర్శి కంటు నాగరాజు, పట్టణ ఉపాధ్యక్షుడు పైడిమర్రి విజయ్, పట్టణ యువ మోర్చ అధ్యక్షుడు సతి బల్వంత్ సింగ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




