Huzurnagar: హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన!
Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ పర్యటన. ₹1600 కోట్ల ముత్యాల బ్రాంచ్ కెనాల్ పనుల పరిశీలన, అభివృద్ధి పనులకు శ్రీకారం.
Huzurnagar: హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన!
Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.
హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరుకు చేరుకొని 1600 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మహాత్మా గాంధీ ముత్యాల బ్రాంచ్ కెనాల్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల కోసం కడుతున్నట్లు దాదాపు 53 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుందని ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలోని మూడు మండలాల రైతులకు లబ్ధి చేకూరుతుందని పంటలతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. అనంతరం మఠంపల్లి మండలం అల్లిపురం లో 12 కోట్లతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
అక్కడనుండి పాలకవీడు మండలంలో 1.43 కోట్లతో నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజలందరికి ఉపయోగపడేలా ఈ హెల్త్ సెంటర్ ఉపయోగపడుతుందని వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాగర్ ఎడమ కాలువకు నీరందించాలని కోరిన రైతులతో మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వచ్చే సెప్టెంబర్ వరకు కూడా వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉంటుందని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిని సాగునీటితో పాటు త్రాగునీటికి కూడా ఉపయోగిస్తున్నందున తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని వాడుకోవడం జరుగుతుందని సాగుకు నీరు అందించే పరిస్థితి లేదని మంత్రి తెలిపారు.
సాగర్ ఆయకట్టు రైతులు ప్రాజెక్టు నీటిపై ఆశలు పెట్టుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం హుజూర్నగర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు.




