Huzurnagar: వినాయక చవితి వేడుకలపై పోలీసుల ఆధ్వర్యంలో శాంతి సమావేశం

Huzurnagar: హుజూర్నగర్ సర్కిల్‌లో వినాయక చవితి శాంతియుతంగా జరగాలని సీఐ చరమంద రాజు, ఎస్ఐ నరేష్ సూచన. డీజేలకు పూర్తి నిషేధం, మట్టి విగ్రహాల వాడకం.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 11 Sept 2026 7:59 PM IST
Huzurnagar
X

Huzurnagar: వినాయక చవితి వేడుకలపై పోలీసుల ఆధ్వర్యంలో శాంతి సమావేశం

హుజూర్నగర్: హుజూర్నగర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ చలికంటి నరేష్ అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐదు మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, విద్యుత్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హుజూర్నగర్ సర్కిల్ పరిధిలో వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమంద రాజు సూచించారు. వినాయక మండపాల ఏర్పాటు, అనుమతుల విధానం, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

వినాయక ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌లకు పూర్తిగా నిషేధం ఉంటుందని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. వినాయకుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవి ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు.

నిమజ్జన కార్యక్రమాలు పోలీసుల సూచనల మేరకు నిర్ణీత మార్గాల్లోనే నిర్వహించాలని కోరారు. విగ్రహాల వద్ద అశ్లీల నృత్యాలు మరియు అసభ్యకరమైన పాటలు పెట్టవద్దని పూర్తిగా భక్తి భావంతో పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని కోరారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR