Huzurnagar: శ్రీ చైతన్య పాఠశాలలో వినాయక చవితి ముందస్తు వేడుకలు
Huzurnagar: హుజూర్ నగర్ శ్రీ చైతన్య పాఠశాలలో ఉత్సాహంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు. మట్టి వినాయకుల పూజల ప్రాముఖ్యతను వివరించిన ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణ.
Huzurnagar: శ్రీ చైతన్య పాఠశాలలో వినాయక చవితి ముందస్తు వేడుకలు
హుజూర్ నగర్: శ్రీ చైతన్య పాఠశాలలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి,విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పోసాని వెంకటరమణ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు మరియు పండుగల వెనుక ఉన్న విశిష్టతను, ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.విఘ్నాలను తొలగించే వినాయకుడి పూజ ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత, క్రమశిక్షణ,
సద్భావన అలవడుతాయని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




