Huzurnagar: పదో తరగతి విద్యార్థులకు ఎస్టీయూ, దాతల చేయూత!

Huzurnagar: హుజూర్‌నగర్‌లో ఎస్టీయూ, ప్రాణిక్ హీలింగ్ ఆధ్వర్యంలో 225 మంది ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు రూ.56,250 పరీక్ష ఫీజులను చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 7 Nov 2026 4:12 PM IST
Huzurnagar
X

Huzurnagar: పదో తరగతి విద్యార్థులకు ఎస్టీయూ, దాతల చేయూత!

హుజూర్‌నగర్: దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హుజూర్‌నగర్ ఎన్‌ఎస్‌పీ క్యాంప్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్ష ఫీజులను ప్రధానోపాధ్యాయులకు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ), ప్రాణిక్ హీలింగ్ యోగ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 225 మంది పదో తరగతి విద్యార్థులకు మొత్తం రూ.56,250 పరీక్ష ఫీజులను దాతలు అందజేశారు. ఆయా పాఠశాలలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులకు ఫీజు మొత్తాన్ని అందించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR