Huzurnagar: తుఫాన్‌తో దెబ్బతిన్న వరి పంట రైతులను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్!
Huzurnagar: తుఫాన్ ప్రభావంతో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి పంటకు తక్షణ పరిహారం అందించాలని టీడీపీ నేత మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్
Huzurnagar: తుఫాన్ ప్రభావంతో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వరి పంట తీవ్రంగా దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ నాయకులు మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలకు వరి పంట నేలకొరిగి నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలని కోరారు.
హుజూర్‌నగర్‌ను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి రైతులకు పంట బీమాతో పాటు ప్రభుత్వ సహాయం అందించాలని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ నాయకులు బానోతు వెంకటరాం నాయక్, పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.




