Huzurnagar: పీఆర్సీని అమలు చేయాలి, జీవో 25 రద్దు చేయాలి టీఎస్ యూటీఎఫ్

Huzurnagar: హుజూర్నగర్‌లో జరిగిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభల్లో పెండింగ్ పీఆర్సీని అమలు చేయాలని, జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 15 Nov 2026 8:43 PM IST
Huzurnagar
X

Huzurnagar: పీఆర్సీని అమలు చేయాలి, జీవో 25 రద్దు చేయాలి టీఎస్ యూటీఎఫ్

హుజూర్నగర్: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని 2023 జూలై నుంచి తక్షణమే అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు నష్టం కలిగించే జీవో నెంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని టౌన్‌హాల్‌లో టీఎస్ యూటీఎఫ్ ఆరవ జిల్లా మహాసభల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడు ఎన్. సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. పాఠశాలల మూసివేత, విలీన ప్రక్రియను నిలిపివేసి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

ఈ సభలో జిల్లాలోని 25 మండల శాఖల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ విద్యారంగ బలోపేతం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ఖాళీ పోస్టుల భర్తీ, విద్యారంగానికి నిధుల పెంపు తదితర అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR