Kodad: సీతానగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం!
Kodad: మునగాల మండలం సీతానగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచ్ బాదావత్ వీరయ్య ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
Kodad: సీతానగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం!
కోదాడ: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల స్థలాల్లో గ్రామ సర్పంచ్ బాదావత్ వీరయ్య సంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని, ఇళ్ల నిర్మాణాల విషయంలో లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ నాగరత్నం, గ్రామ పంచాయతీ కార్యదర్శి నవిత, సూర్యాపేట జిల్లా డీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లపు సతీష్, సీనియర్ జర్నలిస్టు పడిశాల నాగరాజు, లెక్కల సుధాకర్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సింహాద్రి, పడిశాల పరశురాములు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.




