Suryapet: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుంది - సర్వోత్తమ్ రెడ్డి

Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 7 Jun 2026 8:08 PM IST
Suryapet
X

Suryapet: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుంది - సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట: ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఆదివారం ప్రకటించారు.

చివ్వేంల మండలం తుల్జారావుపేట గ్రామంలో లావురి బేబీ నాగరాజు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పేదల సంక్షేమే ప్రధాన ధ్యేయం

ప్రభుత్వ పథకాల అమలుకు ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ ఫలాలు చేర్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. జులై చివరి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవనం అందుతోందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవమని, ఆ గౌరవాన్ని ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

3,500 ఇళ్ల మంజూరు

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమాన ప్రాధాన్యతతో నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు.

సంక్షేమ పథకాల అమలు

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, యువతకు ఉపాధి వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని చెప్పారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతి హామీని అమలు చేస్తున్నామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, చివ్వేంల మండల అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నోజు నర్సింహా చారి, గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మురారి vc తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story