Suryapet: ఇందిరమ్మ ఇల్లు రాజానాయక్ తండాలో ఘనంగా గృహప్రవేశం

Suryapet: సూర్యాపేట మండలం రాజానాయక్ తండాలో లబ్ధిదారు భూక్య చిట్టి శ్రీరాములు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం జరిగింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 30 April 2026 5:51 PM IST
Suryapet
X

Suryapet: ఇందిరమ్మ ఇల్లు రాజానాయక్ తండాలో ఘనంగా గృహప్రవేశం

సూర్యాపేట:సూర్యాపేట మండలం రాజానాయక్ తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఘనంగా జరిగింది. లబ్ధిదారు భూక్య చిట్టి శ్రీరాములు ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి, అర్హులైన ప్రతీ ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని సర్వోత్తమ్ రెడ్డి హామీ ఇచ్చారు.

డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించి, ఒక్కరికీ పక్కా ఇల్లు ఇవ్వలేదని గత ప్రభుత్వం పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, ప్రతీ ఏడాది 3500 చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నునావత్ పాండు నాయక్, పిసిసి ఎస్సి సెల్ చైర్మన్ చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story