Suryapet: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేదల పాలిట వరం: చైర్‌పర్సన్!

Suryapet: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేదల పాలిట వరమని సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత గురువారం 46వ వార్డులో అన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 26 Nov 2026 8:12 PM IST
Suryapet
X

Suryapet: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేదల పాలిట వరం: చైర్‌పర్సన్!

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. స్థానిక 46వ వార్డులో జరిగిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం పేదలకు వరమని అన్నారు.

కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాల్లో ఉంటుందని, వారు ఆ సమయంలో మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిని ఉంటారని, అటువంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.

ఆకస్మికంగా కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు చెల్లిస్తుందని, జీవిత బీమా మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. వార్డు ప్రజలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో 650 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, అలాగే 2150 మందికి పార్టీలకతీతంగా పెన్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏ మున్సిపాలిటీలోనూ ఇంతమందికి ఇందిరమ్మ ఇండ్లు గానీ, పెన్షన్లు గానీ ఇవ్వలేదని ఆమె చెప్పారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జ్ దంతాల సాయి నవీన్, దంతాల వీరయ్య, జీడిమెట్ల రాంబాబు, జూలకంటి నాగరాజు, మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, జూనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్, కంప్యూటర్ ఆపరేటర్ శంకర్, వార్డు ఆఫీసర్ రాజేశ్వరి, భాగ్యరాజు, జవాను లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA