Suryapet: ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వెంటనే ప్రారంభించాలి: సీపీఐ!

Suryapet: కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వెంటనే ప్రారంభించాలని CPI(ML) మాస్ లైన్ డిమాండ్ చేసింది. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 9 July 2026 4:36 PM IST
Suryapet
X

Suryapet: ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వెంటనే ప్రారంభించాలి: సీపీఐ!

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని CPI(ML) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

CPI(ML) మాస్ లైన్ పార్టీ చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంగళవారం నాయకులు కూరగాయల మార్కెట్‌ను సందర్శించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పనులు పూర్తైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రైతులు రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముకునే దుస్థితి నెలకొందని అన్నారు.

కూరగాయలు కొనుగోలుకు వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, దుమ్ము ధూళి ఎక్కువగా ఉండడం, వర్షం వస్తే తడిసిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. మార్కెట్‌కు వచ్చే మహిళలకు టాయిలెట్, తాగునీటి సౌకర్యాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన మార్కెట్‌ను వినియోగంలోకి తేకపోవడం ప్రజాధన దుర్వినియోగమే. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నాయి. రోడ్డుపై వ్యాపారం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి" అని రేణుక అన్నారు.

ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు భీమనపల్లి ప్రకాష్, POW జిల్లా సహాయ కార్యదర్శి సంతోషిమాత, జిల్లా నాయకులు ఐతరాజు పద్మ, భీమనపల్లి పద్మ, నాగమ్మ, లక్ష్మీ, సాయమ్మ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story