Suryapet: హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో పోస్టర్ ఆవిష్కరణ జగదీష్ రెడ్డి!
Suryapet: హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అక్టోబర్ 2 నుంచి 4 వరకు శంషాబాద్ ఎస్ఎస్ కన్వెన్షన్‌లో ప్రదర్శన.
Suryapet: హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో పోస్టర్ ఆవిష్కరణ జగదీష్ రెడ్డి!
Suryapet: హైదరాబాద్ శంషాబాద్ లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో పీపీఐఎన్ & ఫోటోటెక్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న "హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో" పోస్టర్ ను సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఫోటో, వీడియో రంగం రోజురోజుకూ అత్యాధునిక సాంకేతికతతో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. నూతన టెక్నాలజీ, ఆధునిక కెమెరాలు, లెన్స్ లు, లైటింగ్ పరికరాలు, ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లు, ప్రింటింగ్ సేవలను ఒకే వేదికపై పరిచయం చేసేందుకు ఈ ట్రేడ్ షో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తిలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ ట్రేడ్ షో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఫోటో రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలకు అండగా తమ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులోనూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం మాజీ కార్యదర్శి గుణగంటి సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఫోటో ట్రేడ్ షో ఇదేనని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కెమెరా కంపెనీలు, ల్యాబ్ పరికరాల సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా నుంచి ఫోటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ట్రేడ్ షోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తుడి శ్రీనివాస్, హరినాథ్, ఐటిపాముల మల్లికార్జున్, రాగం నగేష్, శ్రీకాంత్, సూర్యాపేట అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు శేఖర్, శంకర్, నగేష్, మహేష్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు కొచ్చర్ల రవి, నజీర్, రాము, నందిపాటి సైదులు, శశిరెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.




