Jangaon: నవాబుపేట రిజర్వాయర్‌ను నింపాలి: బీఆర్‌ఎస్ పల్లా

Jangaon: నవాబుపేట, స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్లను నింపి దేవరుప్పుల మండల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాలని బీఆర్‌ఎస్ నేత పల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 23 July 2026 3:50 PM IST
Jangaon
X

Jangaon: నవాబుపేట రిజర్వాయర్‌ను నింపాలి: బీఆర్‌ఎస్ పల్లా

జనగామ జిల్లా: దేవరుప్పుల మండల ప్రజల సాగు,తాగునీటి కష్టాలను వెంటనే తీర్చాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాల్వల్లో కానరాని సాగునీరు అడుగంటిన బోర్లు ఆందోళన చెందుతున్న రైతన్నలని,స్టేషన్గన్పూర్ రిజర్వాయర్ నవాబ్ పేట రిజర్వాయర్ నింపి కాలువకు నీళ్లు విడుదల చేసి సాగు,తాగు నీటిని తక్షణమే సరఫరా చేయాలని,నవాబుపేట రిజర్వాయర్ ఖాళీగా ఉందని,ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నవాబుపేట రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపి దేవరుప్పుల మండలంలో ఉన్నటువంటి కాలువలను చెక్ డ్యాములను చెరువులను కుంటలను నింపి ప్రజలకు సాగునీరు,తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story