Aleru: ఆలేరు బంద్ విజయవంతం..రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు డిమాండ్!

Aleru: ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ బంద్ నిర్వహించారు.

MAHENDER, ALERU
Published on: 31 July 2026 11:35 AM IST
Aleru
X

Aleru: ఆలేరు బంద్ విజయవంతం..రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు డిమాండ్!

Aleru: ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలేరు పట్టణ బంద్ నిర్వహించారు. బంద్‌కు పట్టణంలోని విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో దుకాణాలు, సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో పట్టణంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ఈ సందర్భంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం వల్ల పరిసర మండలాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ అవుతాయని తెలిపారు. ప్రజల చిరకాల డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఆలేరును వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమ డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. బంద్‌కు ప్రజలు, వ్యాపారులు, విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

MAHENDER, ALERU

MAHENDER, ALERU

Next Story