Nalgonda: కరువుపై అఖిలపక్ష భేటీ పెట్టాలి: జూలకంటి రంగారెడ్డి డిమాండ్!

Nalgonda: కరువుపై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ నవంబర్ 15 నుంచి నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు.

Saleem, Nalgonda
Published on: 3 Oct 2026 5:53 PM IST
Nalgonda
X

Nalgonda: కరువుపై అఖిలపక్ష భేటీ పెట్టాలి: జూలకంటి రంగారెడ్డి డిమాండ్!

నల్లగొండ: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నందున రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, AIKS ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ (36వ) జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసి పంటలను, భూగర్భజలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. నవంబర్ 15న లక్ష మందితో బహిరంగ సభ ఉంటుందని, 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ విధానాలను వీడాలని నేతలు డిమాండ్ చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda