Kanagal: విద్యుత్ కోతలపై తిమ్మన్నగూడెం సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన

Kanagal: కనగల్ మండలం తిమ్మన్నగూడెంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన. 565 రహదారిపై బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ జామ్.

Saleem, Nalgonda
Published on: 16 Sept 2026 8:01 PM IST
Kanagal
X

Kanagal: విద్యుత్ కోతలపై తిమ్మన్నగూడెం సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన

కనగల్: కనగల్ మండలం తిమ్మన్నగూడెం 33 కేవీ సబ్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. గత వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ రైతుల ఆగ్రహం.

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన. రాత్రివేళల్లోనూ కరెంటు కోతలతో పొలాలకు నీళ్లు పారించుకోలేకపోతున్నాం అంటున్న రైతులు.

అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని రైతుల ఆరోపణ. 565రహదారిపై బైఠాయించి రైతుల ఆందోళన. రైతుల నిరసనతో రహదారికి ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda