Kethepally: కొత్తపేటలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ విప్ వేముల వీరేశం

Kethepally: కేతేపెల్లి మండలం కొత్తపేటలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ జరిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం. లబ్ధిదారులను సత్కరించి శుభాకాంక్షల అందజేత.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 8 Nov 2026 4:48 PM IST
Kethepally
X

Kethepally: కొత్తపేటలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ విప్ వేముల వీరేశం

కేతేపెల్లి: కేతేపెల్లి మండలం కొత్తపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి, స్వీట్లు అందజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని టపాసులు కాల్చారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL