Kodad: కోదాడలో బీఆర్ఎస్ పట్టణ బంద్ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య ర్యాలీ!

Kodad: కోదాడలో బీఆర్ఎస్ బంద్ ప్రశాంతం. దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 31 Aug 2026 1:58 PM IST
Kodad
X

Kodad: కోదాడలో బీఆర్ఎస్ పట్టణ బంద్ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య ర్యాలీ!

Kodad: కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. స్థానికంగా డబ్బా కొట్టు నిర్వాహకులు మాదాల ఉపేందర్, గంధం కనకమ్మలపై పోలీసులు వ్యవహరించిన తీరును, దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపుమేరకు ఈ బంద్ చేపట్టారు.

సోమవారం ఉదయం నుంచే మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ చేపట్టారు. భారీ సంఖ్యలో బైక్‌లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు మద్దతుగా పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలు అలాగే ప్రధాన వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బాధిత నిరుపేదలకు తక్షణమే న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన సీఐ మరియు సంబంధిత పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేశారు. కాగా, ఆందోళనలు ఉధృతం కావడంతో అధికారులు స్పందించి, అంతకుముందు తొలగించిన డబ్బాను నిన్ననే యథాస్థానంలో తిరిగి ఏర్పాటు చేశారు. అయినా జరిగిన ఘటనకు నిన్న బంద్ పిలుపు నిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story