Kodad: కోదాడలో ఘనంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు
Kodad: కోదాడలో ఘనంగా అమిత్ షా జన్మదిన వేడుకలు. బీజేపీ యువనేత ఏపూరి సత్యరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నేతలు.
Kodad: కోదాడలో ఘనంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు
కోదాడ: పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో బీజేపీ యువ నాయకుడు ఏపూరి సత్యరాజు మాదిగ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సూర్యాపేట జిల్లా ప్రవాస్ కన్వీనర్ జల్లా జనార్ధన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ఐక్యత, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. బీజేపీ అభివృద్ధితో పాటు దేశ రాజకీయాల్లో అమిత్ షా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోదుమూరు ప్రవీణ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కట్ట కోజు నాగేంద్ర చారి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి పిడతల శంకర్, సీనియర్ నాయకులు మొనగాల శీను, కోదాడ పట్టణ ప్రధాన కార్యదర్శి పైడిమరి సతీష్, కోశాధికారి యాదా కిరణ్, జనసేన కోదాడ నియోజకవర్గ నాయకుడు పసుపులేటి రామారావు, బీజేపీ నాయకులు బడావత్ రమేష్ నాయక్, ఉపేందర్ చారి, కనకాచారి, సంపేట భాగ్యరాజు, కందిబండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




