Kodad: కోదాడ బైపాస్‌పై భయానక ప్రమాదం.. పల్టీ కొట్టి తగలబడిన కారు!

Kodad: కోదాడ బైపాస్‌పై కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. స్థానికులు ఐదుగురిని కాపాడటంతో ముప్పు తప్పింది. అనంతరం కారు దహనమైంది.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 26 July 2026 10:00 AM IST
Kodad
X

Kodad: కోదాడ బైపాస్‌పై భయానక ప్రమాదం.. పల్టీ కొట్టి తగలబడిన కారు!

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా, స్థానికులు చూపిన చొరవతో ఐదు ప్రాణాలు సురక్షితంగా బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో యాదగిరిగుట్టకు బయలుదేరారు. కోదాడ బైపాస్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను డీకొట్టి పల్టీలు కొట్టింది.

కారు పల్టీ కొట్టడాన్ని గమనించిన స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సాహసించి కారు డోర్లు తీసి లోపల ఉన్న ఐదుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు లాగేశారు. ప్రయాణికులు బయటకు వచ్చిన క్షణాల వ్యవధిలోనే కారులోని సీఎన్జీ (CNG) గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు పూర్తిగా కాలి బూడిదైంది. స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి స్పల్ప గాయాలు కాగా, గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక (ఫైర్) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story