Kodad: కోదాడలో ఘనంగా మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

Kodad: కోదాడలో మాంగళ్య షాపింగ్ మాల్ 33వ శాఖ ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సినీ నటి ఆషికా రంగనాథ్. భారీగా తరలివచ్చిన ప్రజలు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 22 July 2026 5:08 PM IST
Kodad
X

Kodad: కోదాడలో ఘనంగా మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

కోదాడ: తెలంగాణలో ప్రముఖ ఫ్యామిలీ షాపింగ్ మాల్ నెట్‌వర్క్ అయిన ‘మాంగళ్య షాపింగ్ మాల్’ తన ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తన నూతన 33వ శాఖను అత్యంత వైభవంగా ప్రారంభించింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుక అత్యంత అట్టహాసంగా, కోలాహలంగా సాగింది.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దక్షిణ భారత సినీ నటి ఆషికా రంగనాథ్ మరియు కోదాడ శాసనసభ్యులు ఎన్. పద్మావతి రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ కసుమ వెంకటరత్నం, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు ప్రత్యేక అతిథులు పాల్గొని నూతన శాఖకు తమ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. కోదాడలో ఇంతటి విశాలమైన షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన మాంగళ్య యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నటి ఆషికా రంగనాథ్ మాల్‌లోని వివిధ విభాగాలను కలియతిరిగి, అక్కడ అందుబాటులో ఉన్న లేటెస్ట్ ఫ్యాషన్ కలెక్షన్లను పరిశీలించారు.

తమ అభిమాన నటిని చూసేందుకు, ప్రారంభోత్సవంలో పాలు పంచుకునేందుకు కోదాడ పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ కుమార్ మాట్లాడుతూ..

వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని, సరికొత్త డిజైన్లను అత్యంత అందుబాటు ధరలకే అందించాలనే లక్ష్యంతో కోదాడలో ఈ 33వ శాఖను ఏర్పాటు చేశామని తెలిపారు. పెళ్లి పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఇలా కుటుంబం మొత్తానికి సరిపడా వస్త్ర శ్రేణిని ఒకే వేదికపై సరికొత్త లాంచ్ ఆఫర్లతో అందిస్తున్నామని వెల్లడించారు. కోదాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story