Kodad: శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ

Kodad: కోదాడ శ్రీ చైతన్య స్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మనీ. ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ SI అంజిరెడ్డి. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పిలుపు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 1 Aug 2026 4:57 PM IST
Kodad
X

Kodad: శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ

కోదాడ: పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య టాలెంట్ డిఎస్ స్కూల్, శ్రీనగర్ కాలనీలోని బ్రాంచ్ లో ఈరోజు జరిగిన పదవీ స్వీకార (Investiture Ceremony) కార్యక్రమానికి కోదాడ ట్రాఫిక్ SI అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం గురించి ప్రసంగించారు.

నేటి బాలలే రేపటి పౌరులు, విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని, నాయకత్వ పటిమ కలిగి ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పాఠశాలలో జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారికి అభినందనలు తెలియచేశారు. గెలుపు ఓటములు‌ పాజిటివ్ గా తీసుకోవాలని సూచించారు.

ఓడిన వారు కృంగిపోవద్దని తిరిగి మరో అవకాశం కొసం ఎదరు చూసి తిరిగి ప్రయత్నించి విజయం సాదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల AGM మురళీ కృష్ణ, R.I డి. వెంకటయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ కోలారాందాస్, వైస్ ప్రిన్సిపాల్ సుమలత, డీన్ ఏడుకొండలు, వేణు,నాగరాజ్, ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story