Kodad: కోదాడలో బాధిత కుటుంబానికి రూ. 5.39 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత!

Kodad: కోదాడ సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి రూ. 5.39 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత. ఎండీ పెద్దిరెడ్డి గణేష్‌ కీలక సూచనలు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 6 Nov 2026 2:30 PM IST
Kodad
X

Kodad: కోదాడలో బాధిత కుటుంబానికి రూ. 5.39 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత!

Kodad: బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడుతుందని సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ పేర్కొన్నారు. కోదాడ సుధా బ్యాంక్ బ్రాంచ్‌లో 2023లో గృహ రుణం తీసుకున్న బానోత్ హతీరామ్ అనే వ్యక్తి ఇటీవల అక్టోబర్ నెలలో ప్రమాదవశాత్తు మరణించారు.

రుణానికి సంబంధించి ఉన్న ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ. 5,39,000/- ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెక్‌ను మృతుడి భార్య బానోత్ సరితకు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పెద్దిరెడ్డి గణేష్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ పెద్దిరెడ్డి.గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.చిన్న మొత్తంతో ఇన్సూరెన్స్ చేసుకోవడం ద్వారా జీవితానికి,తమ కుటుంబానికి కొండంత భద్రత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధా బ్యాంక్ మేనేజర్ చెన్నూరు రవి కుమార్,బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD