Kodad: కోదాడలో విషాదం: కన్నతల్లి దాడిలో తొమ్మిదేళ్ల చిన్నారి జాస్మిన్ మృతి
Kodad: కోదాడ పట్టణంలో కన్నతల్లి సైరా బాను రాయితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల చిన్నారి జాస్మిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Kodad: కోదాడలో విషాదం: కన్నతల్లి దాడిలో తొమ్మిదేళ్ల చిన్నారి జాస్మిన్ మృతి
కోదాడ: పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి దాడిలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల చిన్నారి జాస్మిన్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం ఆడుకుంటున్న చిన్నారి జాస్మిన్‌పై ఆమె తల్లి సైరా బాను రాయితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.
సైరా బాను గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నట్లు బంధువుల నుండీ సమాచారం. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, కోదాడలోని బంధువుల ఇంట్లో తన కుమార్తెతో కలిసి నివసిస్తోంది. చిన్నారి మృతితో కోదాడ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మేనమామ ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




