Kodad: కోదాడలో 2 కిలోల గంజాయితో ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్

Kodad: కోదాడలో 2 కిలోల గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. బైక్, సెల్ ఫోన్ స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 1 Aug 2026 4:06 AM IST
Kodad
X

Kodad: కోదాడలో 2 కిలోల గంజాయితో ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్

కోదాడ: పట్టణ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయితో పాటు ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

పోలీసులకు వచ్చిన సమాచారంలో పట్టణ ఇన్స్‌స్పెక్టర్ శివశంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సైలు అజయ్ కుమార్, లోకేష్ మరియు సిబ్బందితో కలిసి దుర్గాపురం ఎక్స్ రోడ్ సమీపంలోని తుములూరి శ్రీనివాసరావు మామిడి తోటలో నిన్న మధ్యాహ్నం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ దాడిలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అవిడి రాఘవ 27సం" కోదాడ పట్టణం ఈ నిందితుడిపై గతంలో కోదాడ పట్టణంలో నాలుగు గంజాయి కేసులు, చిల్లకల్లు పీఎస్‌లో ఒక మర్డర్ కేసు నమోదై ఉన్నాయని, పంది వినోద్ 24సం"కోదాడ పట్టణం, ఈ నిందితుడిపై గతంలో ఒక పోక్సో కేసు మరియు గంజాయి కేసు నమోదై ఉన్నాయని, మరో నిందితుడు మద్దే రవితేజ అల్వాలపురం గ్రామానికి చెందిన యువకుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

నిందితులు జూలై 29న అల్వాలపురం గ్రామానికి చెందిన మద్దే రవితేజ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. అందులో కొంత భాగాన్ని విక్రయించగా,మిగిలిన దాన్ని చిన్న ప్యాకెట్లుగా మారుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న ప్రధాన సరఫరాదారు మద్దే రవితేజ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పట్టుబడ్డ ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా లేదా విక్రయాల గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి, సహకరించాలని కోదాడ పోలీసులు ప్రజలను కోరారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story