Kodada: ఓట్లు గల్లంతవ్వకుండా చూసుకోవాలి.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
Kodada: సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
Kodada: ఓట్లు గల్లంతవ్వకుండా చూసుకోవాలి.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
Kodada: కోదాడ టౌన్:రాబోయే ఎన్నికలకు బిఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, పార్టీ ఓట్లు డిలీట్ అవ్వకుండా కాపాడుకోవాలని బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు నిచ్చారు. కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన,డిజిటల్ సభ్యత్వాల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లాగే తెలంగాణలోనూ ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని, బూత్ లెవెల్ కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటేనని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని.. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు దుస్తులు కూడా ఇవ్వలేదని, సాగు కోసం రైతులు హరిగోస పడుతున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




