Kodada: కోదాడలో కొత్త పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి సాధన కమిటీ వినతి

Kodada: కోదాడ పాత పోస్ట్ ఆఫీస్ స్థలంలో కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి సాధన కమిటీ వినతిపత్రం అందజేసింది.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 11 May 2026 7:22 PM IST
Kodada
X

Kodada: కోదాడలో కొత్త పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి సాధన కమిటీ వినతి

కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని పాత పోస్ట్ ఆఫీస్ స్థలంలో కొత్త పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం చేయాలని పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణ సాధన కమిటీ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఇట్టి విషయంపై ఎమ్మెల్యే గారు స్పందిస్తూ ఆ స్థలంలో పోస్ట్ ఆఫీస్ భవననిర్మాణం జరిగేటట్టు చూస్తానని తెలియజేశారు. విజ్ఞాపన పత్రం అందజేసిన వారిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, సాధన కమిటీ కన్వీనర్ గంధం బంగారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి, సాధన కమిటీ సభ్యులు రాయపూడి చిన్ని , ముత్తవరపు రామా రావు, కుదరవెల్లి బసవయ్య, ఉప్పగండ్ల సరోజ తదితరులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story