Tipparthy: రూ.111 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన!
Tipparthy: తిప్పర్తిలో రూ.111 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తిప్పర్తిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని వెల్లడి.
Tipparthy: రూ.111 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన!
Tipparthy: మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం తిప్పర్తిలో రూ.111 కోట్ల భారీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులతో పాటు రహదారుల నిర్మాణాలకు ఆయన భూమిపూజ, శంకుస్థాపనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు బిటి రోడ్లు, అంతర్గత రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేలా ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




