Kanchanapalli: వచ్చే దసరా నాటికి కంచనపల్లి ఎత్తిపోతలపూర్తి కోమటిరెడ్డి

Kanchanapalli: వచ్చే దసరాకి కంచనపల్లి ఎత్తిపోతల, సబ్‌స్టేషన్ పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం.

Saleem, Nalgonda
Published on: 2 Aug 2026 12:34 PM IST
Kanchanapalli
X

Kanchanapalli: వచ్చే దసరా నాటికి కంచనపల్లి ఎత్తిపోతలపూర్తి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:

వచ్చే దసరా నాటికి కంచనపల్లి ఎత్తిపోతల పూర్తి

వచ్చే దసరా పండుగ నాటికి నల్గొండ మండలం కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు 33/11 సబ్‌స్టేషన్ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కంచనపల్లిలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, కంచనపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. పండుగ కానుకగా గ్రామంలోని ఆడబిడ్డలందరికీ తన సొంత నిధులతో పట్టుచీరలు ఇస్తానని ప్రకటించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story