Nalgonda: ఆర్ అండ్ బీ పనులపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
Nalgonda: రోడ్లు, భవనాల అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు.
Nalgonda: ఆర్ అండ్ బీ పనులపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
నల్గొండ: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రోడ్లు, భవనాల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని స్పష్టం చేశారు. బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బీ పనులపై గురువారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రోడ్ల మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేసి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, పలువురు చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Next Story




