Munugodu: విద్యార్థుల భవితకు 'సుశీలమ్మ ఫౌండేషన్' భరోసా
Munugodu: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 151 మంది ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు ₹24.50 లక్షల నగదు బహుమతులు అందజేత.
Munugodu: విద్యార్థుల భవితకు 'సుశీలమ్మ ఫౌండేషన్' భరోసా
Munugodu: పేద విద్యార్థులు చదువుకు చేయూతనిస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం(2025-2026) లో ప్రథమ స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం పొందిన విద్యార్థిని విద్యార్థులకు తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద 25000, 15000, 10000 నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేశారు.
గౌరవ మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారి దంపతులు..ఈ కార్యక్రమాన్ని మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గారు..
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన 151 మంది విద్యార్థిని విద్యార్థులను సన్మానించి 24,50000 రూపాయల చెక్కులతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
పేదింటి విద్యార్థులకు చేయూతనిస్తూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ఏడాది జులై 6న, 2024-2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా 15000, 10000, 7500 రూపాయల నగదు బహుమతిని 62 ప్రభుత్వ పాఠశాలలోని 189 విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.
అదే స్ఫూర్తితో ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకు నగదు బహుమతిని అందించారు.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్న ఈ సహాయానికి పేద తల్లిదండ్రుల్లో తమ పిల్లల్ని బాగా చదివించాలని ధైర్యం పెరిగింది... ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగి మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దంపతులు చేస్తున్న ఈ సహాయానికి విద్యార్థిని విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొంది భవిష్యత్తులో తాము కూడా ఎదిగి పదిమందికి సహాయం చేసే విధంగా తయారవుతామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ లక్ష్మీ గారు మాట్లాడుతూ. విద్యార్థిని విద్యార్థులు చెప్పిన మాటలకు మేము కూడా స్ఫూర్తి పొందుతున్నామని, ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతి విద్యార్థిని విద్యార్థి భవిష్యత్తులో పదిమందికి సాయం చేసే విధంగా తయారవ్వాలని ఆకాంక్షించారు.
2018 లో గడపగడప తిరిగి ఎంతో మంది సమస్యలు తెలుసుకున్నామని పది సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి గారు ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని, మునుగోడు నియోజకవర్గం నాయకులందరూ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను నా దృష్టికి తీసుకూరావాలని కోరారు. మా ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తుందని భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇస్తుంటాడు తమకున్న దాంట్లో తోచినంత ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
నాకంటే ఎక్కువ సమాజం కోసం పరితపిస్తుంది నా శ్రీమతి లక్ష్మి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం విద్యా వైద్య విషయంలో సమల మార్పులు తీసుకొస్తుంది. నాకంటే ఎక్కువగా సమాజం కోసం నా శ్రీమతి లక్ష్మీ పరితపిస్తుందని కరోనా కాలంలో ఐదు కోట్ల రూపాయల విలువచేసే నిత్యవసర సరుకుల పంపిణీలో ఆమె కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు.. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులను మనం ప్రోత్సహించాల్సిందేనని వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిందేనని పిల్లల భవిష్యత్తు కోసం మరింత సహాయం చేయాల్సిందేనని తీర్చి చెప్పారు.
నేను బడిని గుడితో సమానంగా చూసే వ్యక్తిని అని మానవసేవే మాధవ సేవకు భావించి సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు.. మునుగోడులో పదిమంది లక్షలు పదిమంది రాజగోపాల్ రెడ్డి గారు తయారవ్వాలని రాజగోపాల్ రెడ్డి ఒక్కడే అనుకుంటే కాదని ప్రతి ఒక్కరూ మీ గ్రామాలలో మీకు చేతనేంత సహాయం చేయాలని కోరారు.
విద్యా వైద్యం సమాజంలో రెండు కండ్ల లాంటివి అని ప్రతి ఒక్కరూ గురుతర బాధ్యతగా ఆ విషయాల కోసం సహాయం చేయాలన్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ అవసరమైతే బంగారం అమ్మి కూడా చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం విద్యా వైద్య విషయంలో సమూల మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థిని విద్యార్థులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలని, డ్రగ్స్ గంజాయి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ కు ఆకర్షితులు కాకుండా అనునిత్యం పిల్లల ప్రవర్తనను గమనిస్తూ చెడు మార్గం వైపు వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని అన్నారు... మనకోసం మనం బ్రతకడంలో గొప్పేం లేదని మనకోసం మనం బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న వారి కోసం బ్రతకడమే గొప్పతనం అని ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వారి కోసం ఎంతో కొంత సహాయపడాలని కోరారు.




